feedburner

Enter your email address:

Delivered by FeedBurner

అపొస్తలలుడైన పౌలు బెన్యామీనుగోత్రమునకు చెందినవాడా? యూదా గోత్రమునకు చెందినవాడా?

అపొ. కార్యములు 21:39.
అందుకు పౌలునేను కిలికియలోని తార్సువాడనైన యూదుడను; ఆ గొప్ప పట్టణపు పౌరుడను. జనులతో మాటలాడుటకు నాకు సెలవిమ్మని వేడుకొనుచున్నానని చెప్పెను.

రోమీయులకు 11:1
నేనుకూడ ఇశ్రాయేలీ యుడను, అబ్రాహాము సంతానమందలి బెన్యామీను గోత్రమునందు పుట్టినవాడను.

అపొస్తలలుడైన పౌలు బెన్యామీనుగోత్రమునకు చెందినవాడా? యూదా గోత్రమునకు చెందినవాడా?

జవాబు కొరకై వేచి చూడండి !





శత్రువులని సైతం ప్రేమించమని చెప్పిన దేవుడు, కనానీయులను బొత్తిగా నాశనము చేయమని ఎందుకు చెప్పాడు ?

జవాబు కొరకై వేచి చూడండి !




బైబిల్ లో చెప్పబడిన దేవుడు ఇశ్రాయేలీయులకే దేవుడా ?

బైబిల్ అంతట ఇశ్రాయేలీయుల గురించే ఉంది కదా, కాబట్టి బైబిల్ లో చెప్పబడిన దేవుడు ఇశ్రాయేలీయులకే దేవుడా ? 

జవాబు కొరకై వేచి చూడండి !




యేసు క్రీస్తు తనని మనుష్య కుమారునిగా ఎందుకు సంభోదించుకున్నాడు?

మనుష్యుని కుమారుడు అంటే ఆయన దైవత్వం తగ్గించినట్లు కాదా?


యూదులు మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు. ఎవరైన తనని తాను దేవునిగా చెప్పుకొంటె అది దైవదూషణ. అటు వంటి వారిని రాళ్లతో కొట్టి చంపేవారు.
యోహాను సువార్త 10:33
యూదులునీవు మనుష్యుడవై యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి.


అందుకనే ప్రభువు తనని తాను క్రీస్తు లేదా మెస్సయ లేదా మనుష్య కుమారునిగా సంభోదించుకున్నారు తప్ప సూటిగా దేవుడు అని చెప్పలేదు. యూదులు మెస్సయని మనుష్యకుమారుడుగా పిలవడం కద్దు.

దానియేలు దర్శనంలో మనుష్యకుమారుని చూసాడు.
దానియేలు 7:13-14
రాత్రి కలిగిన దర్శన ములను నేనింక చూచుచుండగా, ఆకాశమేఘారూఢుడై మనుష్యకుమారునిపోలిన యొకడు వచ్చి, ఆ మహావృద్ధు డగువాని సన్నిధిని ప్రవేశించి, ఆయన సముఖమునకు తేబడెను.
సకల జనులును రాష్ట్రములును ఆ యా భాషలు మాటలాడువారును ఆయనను సేవించునట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయ బడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అదెన్నటికిని తొలగిపోదు; ఆయన రాజ్యము ఎప్పుడును లయముకాదు.


ఆకాశమేఘారూఢుడై వచ్చువాడు,   ఎప్పటికిని లయముకాని రాజ్యము కలవాడు దేవుడు మాత్రమే. మనుష్యకుమారునిగా సంభోదించుకుంటే, ఆయన దైవత్వం తగ్గించినట్లు కాదు. మనుష్యకుమారుడు అంటే మెస్సయ అనే అర్దం కలిగి ఉండె మరోక పేరు మాత్రమే. 




సాతాను దేవుని సింహసనము అదిరోహించగలను అని ఎలా అనుకున్నాడు ?

తేజోనక్షత్రమా, వేకువచుక్కా, నీవెట్లు ఆకాశమునుండి పడితివి?
జనములను పడగొట్టిన నీవు నేలమట్టమువరకు ఎట్లు నరకబడితివి?
నేను ఆకాశమున కెక్కిపోయెదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తరదిక్కుననున్న సభాపర్వతముమీద కూర్చుందును
మేఘమండలముమీది కెక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని నీవు మనస్సులో అనుకొంటివిగదా?
నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే.
 యెషయా 14:12-15

దేవుడు సృష్టికర్త. లూసిఫర్ సృష్టించబడినవాడు. దేవుడే శక్తిమంతుడు. కాని,సాతాను దేవుని సింహసనము అదిరోహించగలను అని ఎలా అనుకున్నాడు ?


సాతాను ఆదాముని మోసం చేసి, దేవుని సన్నిదికి దూరం అయ్యేలా చేసాడు.ఆజ్ఞాతిక్రమం వల్ల ఆదాము పాపం చేసిన వాడయ్యాడు. ఆదాము, అతని సంతతి అయిన మనమందరము దేవుని న్యాయ తీర్పునకు బద్దులమై ఉన్నాము. 

1. దేవుని సింహాసనము నీతిన్యాయములపై కట్టబడి ఉన్నది.
2. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను.
కీర్తనలు 89 :14. నీతిన్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు
యోహాను సువార్త 3:14 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను.


ప్రేమించిన వ్యక్తిపై న్యాయం తీర్చవలిసి వస్తే ? శిక్ష విధిస్తే, ప్రేమని చూపనట్లే కదా !, శిక్ష విధించకపోతే, న్యాయం తీర్చనట్లే కదా ! న్యాయము తీర్చక పోతే, సిం హాసనముపై అధిష్టించడానికి అర్హత లేదని ప్రశ్నించి, తను అధిరోహించవచ్చు. శిక్షిస్తే, ప్రేమాయుడు అని అనిపించుకోలేవని ప్రశ్నించవచ్చు.

ప్రేమా ? న్యాయమా ?


సాతాను యొక్క ప్రణాళిక అదే ! 



ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు నీవు ఏం చేస్తావు ? 

దర్యావేషు నకు ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు, తను ప్రేమించిన దానియేలుని కాపాడటానికి ఒక దినమెల్ల ప్రయత్నించాడు కాని శిక్ష విధించాడు. రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌ తులు దానియేలును పట్టుకొనిపోయి సింహముల గుహలో పడద్రోసిరి(దానియేలు 6: 1-26). ప్రేమ బలహీనమై ఓడిపోయింది.


ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు మన ప్రభువు ఏం చేసాడు ? 
యోహాను సువార్త 8: 1-11 శాస్త్రులును పరిసయ్యులును, వ్యభిచారమందు పట్టబడిన యొక స్త్రీని తోడు కొనివచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా, యీ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను; అట్టివారిని రాళ్లు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మన కాజ్ఞాపించెను గదా; అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన నడిగిరి. 
ఆయన తలయెత్తి చూచిమీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమెమీద రాయి వేయ వచ్చునని వారితో చెప్పి మరల వంగి నేలమీద వ్రాయు చుండెను. వారామాట విని, పెద్దవారు మొదలుకొని చిన్నవారివరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్లిరి; యేసు ఒక్కడే మిగిలెను

ప్రభువు శిక్షించలేదు. అధిక ప్రేమ చూపి క్షమించాడు. మన పాపములకే తనని తాను బలియాగముగా సమర్పించుకొని, న్యాయము కూడా తీర్చినవాడయ్యాడు. ప్రేమ జయించింది.

యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు; వాడు తీర్పులోనికి రాక మరణములొ నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చ యముగా చెప్పుచున్నాను.
 




దేవుడు చనిపోవచ్చా?

మన దేవుడు శక్తిమంతుడు.

యోహాను 10:18 ఎవడును నా ప్రాణము తీసికొనడు; నా అంతట నేనే దాని పెట్టుచున్నాను; దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసికొనుటకును నాకు అధికారము కలదు; నా తండ్రివలన ఈ ఆజ్ఞ పొందితిననెను.