feedburner

Enter your email address:

Delivered by FeedBurner

యేసు క్రీస్తు తనని మనుష్య కుమారునిగా ఎందుకు సంభోదించుకున్నాడు?

మనుష్యుని కుమారుడు అంటే ఆయన దైవత్వం తగ్గించినట్లు కాదా?


యూదులు మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు. ఎవరైన తనని తాను దేవునిగా చెప్పుకొంటె అది దైవదూషణ. అటు వంటి వారిని రాళ్లతో కొట్టి చంపేవారు.
యోహాను సువార్త 10:33
యూదులునీవు మనుష్యుడవై యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి.


అందుకనే ప్రభువు తనని తాను క్రీస్తు లేదా మెస్సయ లేదా మనుష్య కుమారునిగా సంభోదించుకున్నారు తప్ప సూటిగా దేవుడు అని చెప్పలేదు. యూదులు మెస్సయని మనుష్యకుమారుడుగా పిలవడం కద్దు.

దానియేలు దర్శనంలో మనుష్యకుమారుని చూసాడు.
దానియేలు 7:13-14
రాత్రి కలిగిన దర్శన ములను నేనింక చూచుచుండగా, ఆకాశమేఘారూఢుడై మనుష్యకుమారునిపోలిన యొకడు వచ్చి, ఆ మహావృద్ధు డగువాని సన్నిధిని ప్రవేశించి, ఆయన సముఖమునకు తేబడెను.
సకల జనులును రాష్ట్రములును ఆ యా భాషలు మాటలాడువారును ఆయనను సేవించునట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయ బడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అదెన్నటికిని తొలగిపోదు; ఆయన రాజ్యము ఎప్పుడును లయముకాదు.


ఆకాశమేఘారూఢుడై వచ్చువాడు,   ఎప్పటికిని లయముకాని రాజ్యము కలవాడు దేవుడు మాత్రమే. మనుష్యకుమారునిగా సంభోదించుకుంటే, ఆయన దైవత్వం తగ్గించినట్లు కాదు. మనుష్యకుమారుడు అంటే మెస్సయ అనే అర్దం కలిగి ఉండె మరోక పేరు మాత్రమే. 




0 comments:

Post a Comment