feedburner

Enter your email address:

Delivered by FeedBurner

సాతాను దేవుని సింహసనము అదిరోహించగలను అని ఎలా అనుకున్నాడు ?

తేజోనక్షత్రమా, వేకువచుక్కా, నీవెట్లు ఆకాశమునుండి పడితివి?
జనములను పడగొట్టిన నీవు నేలమట్టమువరకు ఎట్లు నరకబడితివి?
నేను ఆకాశమున కెక్కిపోయెదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తరదిక్కుననున్న సభాపర్వతముమీద కూర్చుందును
మేఘమండలముమీది కెక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని నీవు మనస్సులో అనుకొంటివిగదా?
నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే.
 యెషయా 14:12-15

దేవుడు సృష్టికర్త. లూసిఫర్ సృష్టించబడినవాడు. దేవుడే శక్తిమంతుడు. కాని,సాతాను దేవుని సింహసనము అదిరోహించగలను అని ఎలా అనుకున్నాడు ?


సాతాను ఆదాముని మోసం చేసి, దేవుని సన్నిదికి దూరం అయ్యేలా చేసాడు.ఆజ్ఞాతిక్రమం వల్ల ఆదాము పాపం చేసిన వాడయ్యాడు. ఆదాము, అతని సంతతి అయిన మనమందరము దేవుని న్యాయ తీర్పునకు బద్దులమై ఉన్నాము. 

1. దేవుని సింహాసనము నీతిన్యాయములపై కట్టబడి ఉన్నది.
2. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను.
కీర్తనలు 89 :14. నీతిన్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు
యోహాను సువార్త 3:14 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను.


ప్రేమించిన వ్యక్తిపై న్యాయం తీర్చవలిసి వస్తే ? శిక్ష విధిస్తే, ప్రేమని చూపనట్లే కదా !, శిక్ష విధించకపోతే, న్యాయం తీర్చనట్లే కదా ! న్యాయము తీర్చక పోతే, సిం హాసనముపై అధిష్టించడానికి అర్హత లేదని ప్రశ్నించి, తను అధిరోహించవచ్చు. శిక్షిస్తే, ప్రేమాయుడు అని అనిపించుకోలేవని ప్రశ్నించవచ్చు.

ప్రేమా ? న్యాయమా ?


సాతాను యొక్క ప్రణాళిక అదే ! 



ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు నీవు ఏం చేస్తావు ? 

దర్యావేషు నకు ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు, తను ప్రేమించిన దానియేలుని కాపాడటానికి ఒక దినమెల్ల ప్రయత్నించాడు కాని శిక్ష విధించాడు. రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌ తులు దానియేలును పట్టుకొనిపోయి సింహముల గుహలో పడద్రోసిరి(దానియేలు 6: 1-26). ప్రేమ బలహీనమై ఓడిపోయింది.


ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు మన ప్రభువు ఏం చేసాడు ? 
యోహాను సువార్త 8: 1-11 శాస్త్రులును పరిసయ్యులును, వ్యభిచారమందు పట్టబడిన యొక స్త్రీని తోడు కొనివచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా, యీ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను; అట్టివారిని రాళ్లు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మన కాజ్ఞాపించెను గదా; అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన నడిగిరి. 
ఆయన తలయెత్తి చూచిమీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమెమీద రాయి వేయ వచ్చునని వారితో చెప్పి మరల వంగి నేలమీద వ్రాయు చుండెను. వారామాట విని, పెద్దవారు మొదలుకొని చిన్నవారివరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్లిరి; యేసు ఒక్కడే మిగిలెను

ప్రభువు శిక్షించలేదు. అధిక ప్రేమ చూపి క్షమించాడు. మన పాపములకే తనని తాను బలియాగముగా సమర్పించుకొని, న్యాయము కూడా తీర్చినవాడయ్యాడు. ప్రేమ జయించింది.

యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు; వాడు తీర్పులోనికి రాక మరణములొ నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చ యముగా చెప్పుచున్నాను.
 




0 comments:

Post a Comment